ఇండోనేసియా-వివాహ విశేషాలు
ఇండోనేసియా పేరులోనే ఇందుత్వాన్ని కలిగున్న దేశం. కట్టూ, "బొట్టు"ని కూడా గమనించారా!?పైగా వధూవరులకు నలుగుపెట్టి మంగళ స్నానాలు చేయించే ఆచారం ఉండటం ఒక విశేషం! బొట్టుపెట్టుకోవటం, బంగరు కిరీటాన్ని ధరించటం, పూలను ఎంత చక్కగానో ముడవటం వీరి ఆకర్షణలు! ఇక్కడ వరుడుకూడా మన వారిలాగానే బొట్టుపెట్టుకుంటాడు. వధువును ఎత్తుకుని, వరుడికి అప్పగించటం చూస్తే, మన దక్షిణభారతదేశంలో కొన్నిఇండ్లలో వున్న ఆచారానికి దగ్గరి పోలికగా ఉందనిపిస్తోంది. (తండ్రి ఒడిలో కూర్చుండబెట్టి వధువుని వరుడికి,అత్తమామలకు అప్పగించే పద్ధతి!) కొబ్బరి మట్టలు, అరటి ఆకులు, అరటిగెలలు ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి మనలాగానే! శుభలేఖ, హారతి పడుతూ నృత్యం, కల్యాణమంటపం అన్నీ అన్నీ కూడా! ఏమైనా ఈ పెళ్లివేడుకను కనులవిందుగా చేసే వీరిని మనసారా మెచ్చుకోవాలి! వీలైతే వీరి పెళ్లి ఒక్కసారైనా ప్రత్యక్షంగాచూడాలనిపించటంల ేదూ?
ఇండోనేసియా గురించి కొంత చారిత్రిక విషయాలు ఇక్కడచెప్పుకోవాలి. మొదటి శతాబ్ద కాలము
నాటికే ఇండియాకు, ఇండోనేసియాకు మధ్య వాణిజ్యం జరుగుతుండేది. అప్పుడు ఇక్కడి వర్తకులు అక్కడివారిని వివాహాలుచేసుకున్నారని ఒక నమ్మకం. రెండోది ఇక్కడి క్షత్రియులు అంటే రాజులు యుధ్ధాలలో ఓడిపోయినప్పుడు అక్కడ తలదాల్చుకున్నారన్నది. మూడోది బ్రాహ్మణులు హిందూమత ప్రచారానికై వెళ్లారన్నదన్నది.(మహర్షి మార్కండేయుడు తన అనుచరులతో వెళ్లాడు. అక్కడ ఫ్రంబనన్,అచింత్య దేవాలయాలు నిదర్శనం ) నాలుగోది జీవనోపాధికై.
అంతేకాకుండా.. 11 వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అక్కడి రాజ్యాన్ని గెలిచాడు. ఇవన్న్నీ కలిసి అక్కడి సామాజిక,సాంస్కృతిక జీవనవిధానాలు హిందూ సంస్కృతితో ముడిపడిఉన్నాయి. రామాయణం, మహా భారతాలు ఇప్పటికీ రచనల్లోనో, నాటకాలుగా, డాన్స్ బాలే లుగా(నృత్య నాటకాలుగా), తోలుబొమ్మలాటలుగా, జానపద నృత్యాలు, గీతాలుగా అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. విష్ణువుని, శివుణ్ణీ, సరస్వతీదేవినీ పూజిస్తున్నారు. వాళ్ల జాతీయ చిహ్నం గరుత్మంతుడు.

No comments:
Post a Comment