పాలగుండెలో ఏదీ దాగుందో..!!
జూన్ 2013
చిన్నప్పటి రోజులు చాలా అందంగా వుంటాయని..మళ్లీ అవి వచ్చేస్తే ఎంత బాగుండు!! అని మనం చాలాసార్లు అనుకొంటుంటాం. ఒక్కోమారు,అలా అనుకోవటం నాకెందుకో నచ్చదు. అలాగని ఆ రోజుల్నిప్రేమించొద్దని,వాటికి విలువలేదనీ నేననను. ప్రస్తుతావస్థని ప్రేమించలేనివారు గతాన్ని ఏం ప్రేమిస్తారని నా వాదన! ఎప్పుడూ జరిగిపోయినవే మనకు అపూర్వంగా తోయటం, వర్తమానాన్ని యాంత్రికంగా భావించటం!! ఆలోచనలను జరిగిపోయిన విషయాలపైనే సంధించి, వాటిని మధురక్షణాలుగా భావించి(నిజానికి వాటిని ఆ సమయం లో ఎంతో నిర్లిప్తంగా అనుభవించి వుంటాం!) ..నేటి జీవితాన్ని ఆనందించక పోవటం మనం చేస్తున్న పని! ఈ విషయాన్ని తెలుసుకోటానికి కొంతమందికి ఓ జీవితకాలం పడుతుందనుకుంటా! అందులో నేనూ ఒకర్ననిపిస్తోంది. అందుకే మీకిప్పుడు నా కబుర్లు చెప్పాలనిపించింది.
మనవాళ్లున్న పల్లెకు వెళ్తాం. అక్కడ చెరువు చూస్తాం . చెట్లూ చేమలు చూస్తాం. రాములవారి గుడి, గాలిగోపురం..దాని మీద ఎగిరే పావురాలు చూస్తాం. టూరింగ్ టాకీస్ దగ్గర వేరుశనగకాయలు కొనుక్కొని తింటూ ఏదో సినిమా చూశామనిపిస్తాం. ఆ సమయం లో మనల్ని అవేమీ కదిలించవు. నగరానికి తిరిగివచ్చాక, ఆ పల్లెలో బంధువులు చూపిన ఆత్మీయత, ఆ పల్లె సోయగాలు, టూరింగ్ టాకీస్ లో చూసిన మూవీ, తిన్న వేరుశనగకాయలు అపూర్వమనిపిస్తాయి.అదే నేనిప్పుడు చెప్పేది. ఎగిరే పావురాన్ని చూడగానే మన మనస్సూ అలా ఎగిరిపోవాలి. దేవుణ్ణి చూడగానే అప్రయత్నంగా భక్తి భావనతో కనులు అరమోడ్పులవాలి. చెట్లను చూడగానే గంతులెయ్యాలి. నీళ్లను చూడగానే పరుగులు తీయాలి.అదే లోపించింది మనలో. తరవాతెప్పుడో అవి గొప్పగా తోస్తే చేసేదేముంది..ఆనందంగా అనుభవించకపోయాక!?
నిజానికి సౌందర్యాన్వేషణ బాల్యంలోనే మొదలౌతుందంటారు. నాకు దానితోబాటు..దాని తాలూకు అసంతృప్తి కూడా అప్పుడే పుట్టి క్రమక్రమంగా పెరుగుతూనే వచ్చింది. ఫలితం..చిన్న రెక్కలున్న పక్షిని చూసి ఆనందించలేక..ఏదో గుబులు! అందమైన చందమామని చూసి మరేదో దిగులు! నీటిని చూసి ఉరకలేసే మనసులోనే అర్ధం లేని ఆలోచనలు! అద్భుతమైన సూర్యోదయాల్ని పట్టనట్లుగా గడపటం! ఈ స్వభావాన్ని నేను మొదట్లోనే తుంచేస్తే బాగుండు..అదే చేయలేదు నేను.ఈ అసంతృప్తులతో చివరికి భావుకతనే వదిలేసాను. చదువు మీదనే పూర్తి ధ్యానం. చివరికి నేనెలా తయారయ్యానంటే చిన్న చిన్న విషయాలకే ఆనందించే వారంటే చికాకు ఏర్పడింది. అంతలా సంతోషించేంత ఏముందో నాకర్ధమయ్యేది కాదు. పక్కింటి లత ఎప్పుడూ ఒకటే కిలకిలలు! అంతలా నవ్వటం ఎందుకు? చదువులో నాకంటే ఎప్పుడూ వెనకే! నాకంటే ముందుకు వెళ్లాలన్న తపన ఏకోశానా లేదు. ఊర్కే కాలేజ్ కి వస్తుంది. క్లాస్ లో చెప్పిన పాఠాలు వింటుందేమో..అంతే ఇంటికొచ్చాక కథల పుస్తకం తప్పించి క్లాస్ పుస్తకం చేతబట్టి ఎరగదు. పరీక్షలప్పుడు కొంచెం చదువుతుంది..ఎలా రాస్తుందో కానీ డెబ్భై శాతం మార్కులు మాత్రం వస్తాయి. దాంతో సంతృప్తి పడుతుంది. పోటీ తత్వం అసలే లేదు. పోటీలేకపోతే ముందుకు ఎలా దూసుకెళ్లగలం! అదేమీ పట్టదు తనకి. సాయంకాలం కాగానే ఓ ఇత్తడి పూలపళ్లెం పట్టుకొని సన్నజాజి పందిరి దగ్గర నుంచుని కూనిరాగాలు తీస్తూ జాజులు కోస్తుంది. వాటిని మాలలల్లుతుంది. కొంచెం తను పెట్టుకుంటుంది. మిగతావి ఇంట్లో అందరికీ పంచుతుంది. ఒక్కోసారి ఇరుగుపొరుగు వారికి మాలలు ఇస్తుంది. అప్పుడప్పుడూ చుట్టుపక్కల చిన్నపిల్లలతొ ఆడుతుంది. ఎప్పుడైనా పక్కిళ్లల్లో వుండే పెద్దవయసు వారికి కబుర్లు చెప్తుంది. నాకిదంతా చికాగ్గ వుండేది. అలాంటి వారితో స్నేహం చేస్తే నేను వెనకబడిపోతానన్న ఉద్దేశంతో తనకి దూరంగానే వున్నాను. తను ఎదురుపడ్డప్పుడు.. పలకరింపుగా చిరునవ్వు నవ్వినా నేను చూడనట్లు వెళ్లిపోయేదాన్ని. అదేమీ పట్టించుకునేదికాదు. ఎప్పుడు కనబడినా అదే నవ్వు. ఒకోసారి నాకు అసూయగా వుండేది. ఇంత ఆనందం ఈమె సొంతమని! ఐతే ఇప్పుడు తలుచుకున్నా.. ఆమె గురించిన కబుర్లు విన్నా నేను కోల్పోయినదేంటో నాకు తెల్సొచ్చింది. అసలైన ప్రాయపు ముగ్దత్వాన్ని నేను పోగొట్టుకొన్నానని…ఈ పరుగుపందెంలో నన్ను నేను కోల్పోయానని! లత..పేరుకు తగ్గట్టు పరాన్నజీవి అనుకొన్నాను..తన పెళ్లి అని తెలిశాక. పక్కనే జరుగుతున్నఆ పెళ్లికి వెళ్ళలేదుకూడా..! విజయాల మాధుర్యాలు తెలియని ఆమె, నాముందు సిగ్గుపడాలని తలపోశాను. కానీ ఈమధ్య పూర్వ విద్యార్ధి సమ్మేళనానికి వెళ్లినప్పుడు..లతని చూశాను. తనే ముందు పలకరించింది..ఎప్పటి చిరునవ్వు మోముతో…అభిమానంగా చూస్తూ “నిన్ను చూస్తే గర్వంగా వుంటుంది సీమా! నువ్వనుకున్నది సాధించావు. మల్టీ నేషనల్ కంపెనీకి సి.ఇ.వొ ట కదా!”అంది . గర్వంగా నవ్వాను. ఏంచేస్తున్నావంటూ కొంత తక్కువ భావంతోనే అడిగాను.
“డిగ్రీ అవుతూనే పెళ్ళి అయింది కదా! మావారు నీవు పి.జి చదవాలనుకుంటే చదువు అన్నారు. నాకు మొక్కలంటే ప్రాణం.. నీకు తెల్సుగా! అందుకే నాకిష్టమైన సబ్జెక్ట్ బాటనీ. అదే తీసుకున్నాను. పిహెచ్ డి కూడా అయిపోయింది. సెంట్రల్ యూనివర్శిటీ లో ప్రొఫెసర్ని. మా పిల్లలు గ్రాడ్యుయేషన్ కి వచ్చారు.” అంది. ఆమెనెంత తక్కువ అంచనా వేశాను! నా ఉన్నతికి ఆమె ఎంతో ఆనందించింది…ఎంతో నిర్మలంగా వ్యవహరించింది! మరి నేనో!?
ఆనందంగా వుండటం లోనే కాదు.. జీవనగమనం లోకూడా తన ముందు ఓడిపోయాను. లత పరాన్నజీవి అనుకున్నానుకానీ.. ప్రేమగా అల్లుకుపోయి, ఆహ్లాదాన్ని కలిగించేదని అప్పటికి కానీ నాకు తెలియరాలేదు! మొదటిసారి ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాను.
ఇంటికి వస్తూనే మంచం పై చేరగిలపడ్డాను. ఇదే అదునుగా వెనుకటి రోజులు వెంటబడి తరిమాయి.
“నీకు పదహారేళ్లు వుంటాయేమో, బంధువులింట్లో ఉపనయనానికి మొదటిసారి కలిశాం. నిన్నింకా నేను చూడకమునుపే నీ కవితను మా కజిన్.. మీ అన్నయ్య.. అదే మీ కజిన్ కూడానూ.. వాడి చేతిలో వుంటే చదివాను. అప్పుడే నీవు మేమున్న గదిలో అడుగుపెట్టావ్. ఒక్క క్షణం మనిద్దరం చూసుకున్నాం. వెంటనే నీవు పట్టించుకోలేదు నన్ను. వాడి చేతిలో కాగితం తీసికొని చిన్నగా నవ్వుతూ మాట్లాడుతూ వున్నావ్. నీ మాటలేమీ నాకు వినిపించలేదు. కానీ నీ కవిత మాత్రం వినిపిస్తూ ఉందలా…
“ఏ తీరాల వెంబడో ..
అలసిపోని పరుగు తీస్తున్నామే!
నా పరుగు అదేదో నీ పక్కనే కాకూడదా!?
నీ అడుగు వెంబడి..చిన్నగానైనా
తడబడుతూనైనా నడుస్తానే!!
ఆవలితీరం లో ..అర్ధం లేని పరుగుపందెం లో ..
నేను గెలిస్తే మాత్రం ఏం లాభం?
అది నీ శ్వాసకు దగ్గర కాకపోయాక!
నీ దృష్టికి నేను దూరమయ్యాక!!
ఇంత అద్భుతాన్ని(నాకలా అనిపించి వుండొచ్చు) ఇంత చిన్న వయసులోనే ఎలా అక్షరరూపం లోకి తేగలిగావు!? ఆ క్షణన్నే నీవు నాకు చాలా సన్నిహితంగా తోచావు. నేను నీ మనస్సుకు దగ్గర కావాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే నాకే తెలియని ఆ బాంధవ్యం ఎక్కడ విచ్ఛిన్నమౌతుందోనని నా భయం! కానీ నీవే పలకరించావు.. మావాడు పరిచయం చేశాక.
‘ఎక్కడుంటారు?’ అన్నావు నీవు మంద్ర స్వరాన.
‘రాజమండ్రి ‘ అన్నాను హీన స్వరాన.
‘నాకు చాల ఇష్టం గోదావరి ప్రాంతాలన్నీ’ అన్నావు.
‘మీరు రాజమండ్రి రాకూడదూ?’ అన్నాను నేను.
‘ఎందుకూ?’ అన్నావు నీవు.
నా మనసు తొందరపాటుకు నేనే తడబడ్డాను.
‘ఎందుకంటే..గోదావరిని చూద్దురుగాని..మీ కవితలు అప్పుడు బావుంటాయి ‘ అన్నాను.
‘ఇప్పుడు బాలేవా?’ అన్నావు..వెళ్లిపోయావు చిన్నగా నవ్వుతూ..గుండెను పిండి ఆరవేసి మరీ!
చంటి చెప్పటం పూర్తయ్యింది.
మారాలి..మునుపటి వలే! ఇప్పటి నేను లోకి ‘అప్పటి నేను’ని ఆవాహన చేసుకోవలే!!
ఇందాకే చెప్పానే.. మనం వర్తమానంలో గుర్తించం. అది వెనక్కు వెళ్లిపోయాక, దాని విలువని, దాని ఉనికినీ అప్పుడుగానీ గుర్తించము.. అని!
అదిగో కాలింగ్ బెల్ మోగుతోంది. ఆకాష్ వచ్చినట్లున్నాడు. పేరుకు ఒకరికొకరు జీవితభాగస్వాములమే కానీ..ఒకే ఇంట్లో ఎవరి జీవితాలు వాళ్లవే అన్నట్లు గడిపేస్తున్నాం. ఇక ఇప్పుడలాకాదు. నా జీవన సహచరుడుకి ఎదురేగి.. సరికొత్తగా ఆహ్వానించటానికి లేచాను.
****
ఒకప్పటి సంగతి:మనవాళ్లున్న పల్లెకు వెళ్తాం. అక్కడ చెరువు చూస్తాం . చెట్లూ చేమలు చూస్తాం. రాములవారి గుడి, గాలిగోపురం..దాని మీద ఎగిరే పావురాలు చూస్తాం. టూరింగ్ టాకీస్ దగ్గర వేరుశనగకాయలు కొనుక్కొని తింటూ ఏదో సినిమా చూశామనిపిస్తాం. ఆ సమయం లో మనల్ని అవేమీ కదిలించవు. నగరానికి తిరిగివచ్చాక, ఆ పల్లెలో బంధువులు చూపిన ఆత్మీయత, ఆ పల్లె సోయగాలు, టూరింగ్ టాకీస్ లో చూసిన మూవీ, తిన్న వేరుశనగకాయలు అపూర్వమనిపిస్తాయి.అదే నేనిప్పుడు చెప్పేది. ఎగిరే పావురాన్ని చూడగానే మన మనస్సూ అలా ఎగిరిపోవాలి. దేవుణ్ణి చూడగానే అప్రయత్నంగా భక్తి భావనతో కనులు అరమోడ్పులవాలి. చెట్లను చూడగానే గంతులెయ్యాలి. నీళ్లను చూడగానే పరుగులు తీయాలి.అదే లోపించింది మనలో. తరవాతెప్పుడో అవి గొప్పగా తోస్తే చేసేదేముంది..ఆనందంగా అనుభవించకపోయాక!?
నిజానికి సౌందర్యాన్వేషణ బాల్యంలోనే మొదలౌతుందంటారు. నాకు దానితోబాటు..దాని తాలూకు అసంతృప్తి కూడా అప్పుడే పుట్టి క్రమక్రమంగా పెరుగుతూనే వచ్చింది. ఫలితం..చిన్న రెక్కలున్న పక్షిని చూసి ఆనందించలేక..ఏదో గుబులు! అందమైన చందమామని చూసి మరేదో దిగులు! నీటిని చూసి ఉరకలేసే మనసులోనే అర్ధం లేని ఆలోచనలు! అద్భుతమైన సూర్యోదయాల్ని పట్టనట్లుగా గడపటం! ఈ స్వభావాన్ని నేను మొదట్లోనే తుంచేస్తే బాగుండు..అదే చేయలేదు నేను.ఈ అసంతృప్తులతో చివరికి భావుకతనే వదిలేసాను. చదువు మీదనే పూర్తి ధ్యానం. చివరికి నేనెలా తయారయ్యానంటే చిన్న చిన్న విషయాలకే ఆనందించే వారంటే చికాకు ఏర్పడింది. అంతలా సంతోషించేంత ఏముందో నాకర్ధమయ్యేది కాదు. పక్కింటి లత ఎప్పుడూ ఒకటే కిలకిలలు! అంతలా నవ్వటం ఎందుకు? చదువులో నాకంటే ఎప్పుడూ వెనకే! నాకంటే ముందుకు వెళ్లాలన్న తపన ఏకోశానా లేదు. ఊర్కే కాలేజ్ కి వస్తుంది. క్లాస్ లో చెప్పిన పాఠాలు వింటుందేమో..అంతే ఇంటికొచ్చాక కథల పుస్తకం తప్పించి క్లాస్ పుస్తకం చేతబట్టి ఎరగదు. పరీక్షలప్పుడు కొంచెం చదువుతుంది..ఎలా రాస్తుందో కానీ డెబ్భై శాతం మార్కులు మాత్రం వస్తాయి. దాంతో సంతృప్తి పడుతుంది. పోటీ తత్వం అసలే లేదు. పోటీలేకపోతే ముందుకు ఎలా దూసుకెళ్లగలం! అదేమీ పట్టదు తనకి. సాయంకాలం కాగానే ఓ ఇత్తడి పూలపళ్లెం పట్టుకొని సన్నజాజి పందిరి దగ్గర నుంచుని కూనిరాగాలు తీస్తూ జాజులు కోస్తుంది. వాటిని మాలలల్లుతుంది. కొంచెం తను పెట్టుకుంటుంది. మిగతావి ఇంట్లో అందరికీ పంచుతుంది. ఒక్కోసారి ఇరుగుపొరుగు వారికి మాలలు ఇస్తుంది. అప్పుడప్పుడూ చుట్టుపక్కల చిన్నపిల్లలతొ ఆడుతుంది. ఎప్పుడైనా పక్కిళ్లల్లో వుండే పెద్దవయసు వారికి కబుర్లు చెప్తుంది. నాకిదంతా చికాగ్గ వుండేది. అలాంటి వారితో స్నేహం చేస్తే నేను వెనకబడిపోతానన్న ఉద్దేశంతో తనకి దూరంగానే వున్నాను. తను ఎదురుపడ్డప్పుడు.. పలకరింపుగా చిరునవ్వు నవ్వినా నేను చూడనట్లు వెళ్లిపోయేదాన్ని. అదేమీ పట్టించుకునేదికాదు. ఎప్పుడు కనబడినా అదే నవ్వు. ఒకోసారి నాకు అసూయగా వుండేది. ఇంత ఆనందం ఈమె సొంతమని! ఐతే ఇప్పుడు తలుచుకున్నా.. ఆమె గురించిన కబుర్లు విన్నా నేను కోల్పోయినదేంటో నాకు తెల్సొచ్చింది. అసలైన ప్రాయపు ముగ్దత్వాన్ని నేను పోగొట్టుకొన్నానని…ఈ పరుగుపందెంలో నన్ను నేను కోల్పోయానని! లత..పేరుకు తగ్గట్టు పరాన్నజీవి అనుకొన్నాను..తన పెళ్లి అని తెలిశాక. పక్కనే జరుగుతున్నఆ పెళ్లికి వెళ్ళలేదుకూడా..! విజయాల మాధుర్యాలు తెలియని ఆమె, నాముందు సిగ్గుపడాలని తలపోశాను. కానీ ఈమధ్య పూర్వ విద్యార్ధి సమ్మేళనానికి వెళ్లినప్పుడు..లతని చూశాను. తనే ముందు పలకరించింది..ఎప్పటి చిరునవ్వు మోముతో…అభిమానంగా చూస్తూ “నిన్ను చూస్తే గర్వంగా వుంటుంది సీమా! నువ్వనుకున్నది సాధించావు. మల్టీ నేషనల్ కంపెనీకి సి.ఇ.వొ ట కదా!”అంది . గర్వంగా నవ్వాను. ఏంచేస్తున్నావంటూ కొంత తక్కువ భావంతోనే అడిగాను.
“డిగ్రీ అవుతూనే పెళ్ళి అయింది కదా! మావారు నీవు పి.జి చదవాలనుకుంటే చదువు అన్నారు. నాకు మొక్కలంటే ప్రాణం.. నీకు తెల్సుగా! అందుకే నాకిష్టమైన సబ్జెక్ట్ బాటనీ. అదే తీసుకున్నాను. పిహెచ్ డి కూడా అయిపోయింది. సెంట్రల్ యూనివర్శిటీ లో ప్రొఫెసర్ని. మా పిల్లలు గ్రాడ్యుయేషన్ కి వచ్చారు.” అంది. ఆమెనెంత తక్కువ అంచనా వేశాను! నా ఉన్నతికి ఆమె ఎంతో ఆనందించింది…ఎంతో నిర్మలంగా వ్యవహరించింది! మరి నేనో!?
ఆనందంగా వుండటం లోనే కాదు.. జీవనగమనం లోకూడా తన ముందు ఓడిపోయాను. లత పరాన్నజీవి అనుకున్నానుకానీ.. ప్రేమగా అల్లుకుపోయి, ఆహ్లాదాన్ని కలిగించేదని అప్పటికి కానీ నాకు తెలియరాలేదు! మొదటిసారి ఆమెను మనస్ఫూర్తిగా అభినందించాను.
ఇంటికి వస్తూనే మంచం పై చేరగిలపడ్డాను. ఇదే అదునుగా వెనుకటి రోజులు వెంటబడి తరిమాయి.
****
గుండె తలుపులు తట్టినట్లు.. బయట తలుపుల చప్పుడు. వెళ్లి తలుపు తీశాను. అతను..’బాగున్నావా’ అని నవ్వుతూ పలకరించాడు. ఎవరబ్బా అనుకుంటూ వుండిపోయాను. సమాధానమైనా చెప్పాలని తోచలేదు నాకు. అతను లోపలికి వచ్చేసి ‘నేను..చంటి ‘ అన్నాడు. ఏదో కొంచెం గుర్తొచ్చింది. కానీ నీటిపై బుడగలల్లే మాత్రమే. అతనే చొరవగా కుర్చీలో కూర్చొని“నీకు పదహారేళ్లు వుంటాయేమో, బంధువులింట్లో ఉపనయనానికి మొదటిసారి కలిశాం. నిన్నింకా నేను చూడకమునుపే నీ కవితను మా కజిన్.. మీ అన్నయ్య.. అదే మీ కజిన్ కూడానూ.. వాడి చేతిలో వుంటే చదివాను. అప్పుడే నీవు మేమున్న గదిలో అడుగుపెట్టావ్. ఒక్క క్షణం మనిద్దరం చూసుకున్నాం. వెంటనే నీవు పట్టించుకోలేదు నన్ను. వాడి చేతిలో కాగితం తీసికొని చిన్నగా నవ్వుతూ మాట్లాడుతూ వున్నావ్. నీ మాటలేమీ నాకు వినిపించలేదు. కానీ నీ కవిత మాత్రం వినిపిస్తూ ఉందలా…
“ఏ తీరాల వెంబడో ..
అలసిపోని పరుగు తీస్తున్నామే!
నా పరుగు అదేదో నీ పక్కనే కాకూడదా!?
నీ అడుగు వెంబడి..చిన్నగానైనా
తడబడుతూనైనా నడుస్తానే!!
ఆవలితీరం లో ..అర్ధం లేని పరుగుపందెం లో ..
నేను గెలిస్తే మాత్రం ఏం లాభం?
అది నీ శ్వాసకు దగ్గర కాకపోయాక!
నీ దృష్టికి నేను దూరమయ్యాక!!
ఇంత అద్భుతాన్ని(నాకలా అనిపించి వుండొచ్చు) ఇంత చిన్న వయసులోనే ఎలా అక్షరరూపం లోకి తేగలిగావు!? ఆ క్షణన్నే నీవు నాకు చాలా సన్నిహితంగా తోచావు. నేను నీ మనస్సుకు దగ్గర కావాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే నాకే తెలియని ఆ బాంధవ్యం ఎక్కడ విచ్ఛిన్నమౌతుందోనని నా భయం! కానీ నీవే పలకరించావు.. మావాడు పరిచయం చేశాక.
‘ఎక్కడుంటారు?’ అన్నావు నీవు మంద్ర స్వరాన.
‘రాజమండ్రి ‘ అన్నాను హీన స్వరాన.
‘నాకు చాల ఇష్టం గోదావరి ప్రాంతాలన్నీ’ అన్నావు.
‘మీరు రాజమండ్రి రాకూడదూ?’ అన్నాను నేను.
‘ఎందుకూ?’ అన్నావు నీవు.
నా మనసు తొందరపాటుకు నేనే తడబడ్డాను.
‘ఎందుకంటే..గోదావరిని చూద్దురుగాని..మీ కవితలు అప్పుడు బావుంటాయి ‘ అన్నాను.
‘ఇప్పుడు బాలేవా?’ అన్నావు..వెళ్లిపోయావు చిన్నగా నవ్వుతూ..గుండెను పిండి ఆరవేసి మరీ!
చంటి చెప్పటం పూర్తయ్యింది.
****
కలవరంగా ..’కల..వరం ‘ గా లేచాను. ఎవరూ కనిపించలేదు. అతను రావటం నిజం కాదన్న మాట! మర్చిపోయాననుకున్నా! సబ్ కాన్షస్ లో వుందేమో కలగా వచ్చింది. ఇప్పుడునాకదంతా గుర్తుకు వచ్చింది.నాకోసం అక్కడికి వచ్చిన మా అక్కయ్య(బంధువులామె) అక్కడ ఉన్నానేమోనని అడిగిందట.కవితలు రాసే అమ్మాయైతే మాత్రం ఇప్పుడే వెళ్లిపోయింది. తను మీ చెల్లెలేమో తెలీదు అన్నాడట చంటి. అతను వాళ్లూరు వెళ్లిపోయాక నా పేరు చాలా సార్లు అంటూవుంటే.. వాళ్లింట్లో అందరూ ‘చంటి పడిపోయాడ ‘ని ఆటపట్టించారుట. అదీ ఆమే చెప్పింది తర్వాతెప్పుడో కలిశాక. నవ్వి ఊరుకున్నాను కానీ నేనప్పుడేమీ పట్టించుకోలేదు. అంతే నాకిక గుర్తు కూడా లేదు. గుర్తు లేకపోవడమేకాదు.. క్రమంగా నాకు నేనే దూరమయ్యాను కూడా! ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడిచ్చిన ఈ చిన్ని జీవితాన్ని ఆత్మీయులకు, ప్రకృతికి, పరిసరాలకు, చిన్ని చిన్ని ఆనందాలకు దూరంగా, అసంతృప్తులకు ఆలవాలంగా ..ప్చ్.. ఇది సరైన మార్గం కాదు.మారాలి..మునుపటి వలే! ఇప్పటి నేను లోకి ‘అప్పటి నేను’ని ఆవాహన చేసుకోవలే!!
****
చంటి..!! నా ఙ్ఞాపకాల పుస్తకం లో అదో అందమైన పేజీ !!ఇందాకే చెప్పానే.. మనం వర్తమానంలో గుర్తించం. అది వెనక్కు వెళ్లిపోయాక, దాని విలువని, దాని ఉనికినీ అప్పుడుగానీ గుర్తించము.. అని!
అదిగో కాలింగ్ బెల్ మోగుతోంది. ఆకాష్ వచ్చినట్లున్నాడు. పేరుకు ఒకరికొకరు జీవితభాగస్వాములమే కానీ..ఒకే ఇంట్లో ఎవరి జీవితాలు వాళ్లవే అన్నట్లు గడిపేస్తున్నాం. ఇక ఇప్పుడలాకాదు. నా జీవన సహచరుడుకి ఎదురేగి.. సరికొత్తగా ఆహ్వానించటానికి లేచాను.
—-
అవును ! ఎప్పుడూ జరిగిపోయినవే మనకు అపూర్వంగా తోయటం, వర్తమానాన్ని యాంత్రికంగా భావించటం!!”అబ్బ అవి గోల్డెన్ డేస్ అనో లేకపోతె.మా రోజుల్లో అయతే అనో ఇలా చాల statements ఇవ్వడం సాధరణం గ జరుగుతూ వుంటుంది. మళ్ళి అదే నోటితో live for the moment అని కూడా అంటారు.మరి అలాంటప్పుడు వర్తమానం యెంత బావుంటుంది. చిన్న చిన్న ఆనందాలు,ఉన్న వాటిలోనే సంతృప్తి పడుతూవుంటే, ఆ జీవితంఎంతో సంతోషంగ వుంటుంది.
చక్కటి శైలితో ఎంతో బాగా రాసారు
తారసపడుతూ ఉంటారు. కాని మనం కూడా ఏదో ఒక రోజు ఇలానే ఆలోచిస్తాం. ఎందుకంటే వర్తమానం యాంత్రికంగా ఉండడమే.
జరిగిన రోజులే చాలా బాగున్నాయి ప్రతి క్షణం అనుకుంటాం, ఆ రోజులు మళ్ళి వస్తే ఎంతబావుంటుంది అని. కాని ప్రతి క్షణం అపురూపం అనుకుని జీవిస్తే, జీవితం చాలా అందమైన,ఆనందమైన కావ్యం లా సాగిపోతుంది. అందుకే ఆ పరిణితి మన అందరిలో రావాలి. వస్తుందని ఆశిద్దాం.