కాంభోజ రాజ్యం-వివాహ తంతు
చూశారా కంబోడియాలో పెళ్లిళ్లు జరిగే తీరు? మన ఇండియాలో జరిగే పెళ్లిళ్లలా అనిపించటంలేదూ? కొన్ని అయితే తెలుగింట పెళ్లిని తలపిస్తున్నాయి. వివాహానికి వీరు ధరించే పట్టువస్త్రాలు, ఆభరణాలు మరియు అరటి మొక్కలతో మంటపాన్ని అలంకరించటం పూర్తిగా మన సంస్కృతిని మరపించటంలేదూ!? గొడుగు పట్టుకున్న తంతు మన కాశీయాత్రను గుర్తుకు తెప్పిస్తోంది. సన్నాయికి బదులుగా వేణూ వాదన, మన కంకణ ధారణ, పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవటం ..ఇంకా ఇంకా ఎన్నో ముచ్చటగొలిపేలా ఉన్నాయి!
ప్లెంగ్ కాహ్ ..ఇది " వివాహ సంగీతం " ఇది బృందంగా ఆలపించబడే సంగీతం. కొన్ని రోజుల పాటు సాగే వివాహాలలో వివిధ సంప్రదాయక సంబంధాలలో భాగమైన ఈ సంగీతం కంబోడియన్ ప్రజాదరణ పొందింది.
కంబోడియన్లు ఒకరికి ఒకరు నమస్కారం చెప్పడం ద్వారా గౌరవాన్ని ప్రదర్శిస్తారు.కంబోడియాలో అనుసరిస్తున్న పలువిధానాలలో హిందూయిజం, అంకోరియన్ సంస్కృతి ఎక్కువ ప్రభావితంగా అనిపిస్తోంది.
దీనికి పౌరాణిక గాధ ఒకటి ఉంది. భారతదేశ బ్రాహ్మణ యువకుడు కౌండిన్యుడు(బహుశ..కౌండిన్య ఋషి) ఇక్కడికి సమూద్రయానము చేసి వచ్చి ఇక్కడి రాజకుమార్తె మరియు నాగకన్య(జాతి) ను వివాహమాడాడని! ఆమె తండ్రి అయిన నాగ రాజు (మనదేశంలోని నాగాలాండ్ నుండి వలసవెళ్లి కంబోడియాలో స్థిరపడిన రాజవంశాలున్నాయి. బహుశ నాగజాతికి చెందిన రాజు ఆయన అయుండొచ్చు!) కట్నంగా ఈ ద్వీపాన్ని కౌండిన్యుడికి ఇచ్చివేశాడని, కౌండిన్యుడు పాలించిన రాజ్యం కాబట్టి అది కాంభోజంగా పిలువబడింది అని!
ప్లెంగ్ కాహ్ ..ఇది " వివాహ సంగీతం " ఇది బృందంగా ఆలపించబడే సంగీతం. కొన్ని రోజుల పాటు సాగే వివాహాలలో వివిధ సంప్రదాయక సంబంధాలలో భాగమైన ఈ సంగీతం కంబోడియన్ ప్రజాదరణ పొందింది.
కంబోడియన్లు ఒకరికి ఒకరు నమస్కారం చెప్పడం ద్వారా గౌరవాన్ని ప్రదర్శిస్తారు.కంబోడియాలో అనుసరిస్తున్న పలువిధానాలలో హిందూయిజం, అంకోరియన్ సంస్కృతి ఎక్కువ ప్రభావితంగా అనిపిస్తోంది.
దీనికి పౌరాణిక గాధ ఒకటి ఉంది. భారతదేశ బ్రాహ్మణ యువకుడు కౌండిన్యుడు(బహుశ..కౌండిన్య
No comments:
Post a Comment