సుభద్రా కుమారి చౌహాన్ "మేరా నయా బచ్పన్ "కి నా స్వేచ్చానువాదం..
Avn Acharya గారి ప్రోత్సాహం తో
నా సరికొత్త బాల్యం!!
మాటిమాటికీ బాల్యపు మథుర ఙ్ఞాపకం నన్ను పలకరిస్తూవుంటుంది
జీవితపు అంతులేని నా ఆనందాన్ని తీసుకుని వెళ్ళిపోయావు కదా నీవు?
చింతల్లేని ఆటపాటలు.. నిర్భయంగా గంతులు
ఎలా మరచిపోగలను ఆ ప్రాయపు అతులితమైన ఆనందాన్ని!
బాల్యమా! ఓ ప్రాకృతిక విశ్రాంతమా! రావూ?
వ్యథల్నీ, వ్యాకులతల్నీ పోగొట్టి
ఒక్కసారి నా నిర్ల్మలమైన శాంతిని నాకు తిరిగివ్వవూ!?
ఆ భోళాతనం.. ఆ సరళత.. ఏపాపాలు అంటని మథురప్రియ జీవితం!
మళ్ళీ నీవొచ్చి నా మనోబెంగల్ని పోగొట్టకూడదూ?
ఈ ఙ్ఞాపకాలతో సతమతమయ్యే నాకు..ఇప్పుడు
నా బాల్యాన్ని నెమరేసుకునేలా నా చిట్టితల్లి పలికింది
నా చిన్ని పొదరింటిని నందనవనం చేసింది
నేనూ తనతో ఆడుతాను పాడుతాను కేరింతలు కొడతాను
తనలాగే నేనూ చిన్నపిల్లనైపోతాను!
నా చిన్నారి తల్లి ..
"అమ్మా" అంటూ పిలిచింది..మన్ను తినటం నేర్చింది
మూతికి అంటినది కొంత..చేతిలో అలదుకుని నాకోసం తెచ్చినది కొంత!
తనువంతా పులకలు..ఉల్లాసం
మోమున ఆహ్లాదపు అరుణిమ..విజయగర్వతో మెరుస్తున్న నయనాలు..
"ఏంతెచ్చావు అమ్మలూ" అడిగిననాకు.."తినూ.." అంటూ చాచిన చిట్టిచేయి..
మనసు ప్రఫుల్లమైంది. నాబాల్యం నా పాప రూపం లో వచ్చింది
ఆ మనోహర మూర్తిని చూసి..నాలో కొత్తజీవితం పల్లవించింది
ఇన్నేళ్లుగా దేనికోసమై వెతుకుతున్నానో అది తానంత తానే వరమై వచ్చింది!!
నానుంచి పారిపోయిన నా బాల్యం తిరిగొచ్చింది!!

No comments:
Post a Comment