లైఫ్ ఆఫ్ పై కి వచ్చిన ఆస్కార్ అవార్డులు నిజానికి భారతీయతకు వచ్చినవే. భారతదేశం లోని దారిద్యాన్ని మాత్రమే చూసే మహానుభావులకి
అసలైన భారతీయతను చూపించిన ప్రయత్నం చేసిన దర్శకుడు ఆంగ్ లీ .. ముఖ్యంగా రచయిత యాన్ మార్టెల్ కు బోలెడు కృతఙ్ఞతలు
చెప్పుకోవాలి.
సకల చరాచర బ్రహ్మాండమంతా ఓ చిన్న కుటుంబం తో మొదలై, ఆ చిన్న కుటుంబంతోనే సుఖాంతమౌతుందన్న భారత సంస్కృతి ని ఈ
సినిమా చూపించింది. మన మనసుల్ని చూరగొంది.
క్రీస్తును , అల్లాను పరిచయం చేసినందుకు విష్ణువుకు ధన్యవాదాలు తెలుపుకున్న భారత మతాన్ని ప్రపంచానికే పరిచయం చేసింది.
కష్టనష్టాలలో , ఒడుదుడుకుల్లో వున్నవారిని గమనిస్తూ, మార్గాన్ని చూపిస్తూ, ముందుకు నడిపించే ఓ అదృశ్యమూర్తిని దృశ్యరూపం
గావించింది.
ఓ చిన్న ఆశ, ఓ గొప్ప విశ్వాసం మనిషిని అడుగడుగుకీ ముందుకు నడుపుతాయన్న ప్రాథమిక పాఠాలని నేర్పింది.
భయంకరమైన ఒంటరితనంలో కౄరమృగాన్ని సైతం స్నేహితుడిగా భావించిన, ఆదరించిన.. అంతర్లీన మానవత్వవు ఛాయల్ని వెలుగులోకి
తెచ్చింది.
ఇంతెందుకు, మహాసముద్రమంత భారతీయ తత్వాన్ని నిండుగా, మెండుగా ప్రత్యక్షం గావించింది. అవగాహన చేసుకొనేందుకు ఓ అవకాశాన్ని,
ప్రయత్నాన్ని కల్పించింది.
ఎన్నో మాయాజాలాల్ని గుప్పించిన సినిమాలని దాటి అవలీలగా ముందుకు దూసుకెళ్లిన ఈ "విశ్వమాయా"(విష్ణుమాయ) చిత్రాన్ని గుర్తించిన
జ్యురీ సభ్యులకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.
ఇందులో నటీనటులందరూ మెప్పించేవారే..మెప్పించినవారే!
ముఖ్యంగా, హైలీ ఇంటలెక్చువల్ గా కనిపించే పై పటేల్ పాత్రకు
బాల నటుడు సరేసరి! నవయువకుడుగా సూరజ్ శర్మ ద గ్రేట్ ఇండియన్ బాయ్..హాట్స్ ఆఫ్ హిం !
-చింతలచెరువు సువర్చల
నేనింకా ఆ చిత్రం చూడలేదు వెంటనే చూడాలనిపించే ఉత్సుకత కలిగించారు,కనుక మీకు ధన్య వాదాలు!
ReplyDelete